'ది ఘోస్ట్' నుండి నాగార్జున బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ తమహగనే తో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది.తాజాగా విడుదలైన ట్రైలర్ 9 మిలియన్ల వ్యూస్, 200K పైగా లైక్స్ తో ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది.

 King Nagarjuna’s Special Birthday Poster From Praveen Sattaru , The Ghost Is O-TeluguStop.com

ఈరోజు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ పోస్టర్ లో తమహగనే చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చుని హైలీ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నాగార్జున.

సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ గా నిలిచింది.

ఈ చిత్రంలో తమహగనే అనేది నాగార్జున ఆయుధం.

తమహగనే గ్లింప్స్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది.

నాగార్జున, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు.ఈ చిత్రంలో గుల్ పనాగ్ , అనిఖా సురేంద్రన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు కాగ, భరత్, సౌరబ్ ద్వయం పాటలు అందించారు.

ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube