తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువసామ్రాట్ గా, కింగ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నాగార్జున( Hero Nagarjuna ) ప్రస్తుతం తన 100 వ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లను వింటున్నాడు.ఇక అందులో భాగంగానే చాలామంది దర్శకుల కథలను వింటున్నాడు.
ఇక తన వందో సినిమాతో పాటు ఆ తర్వాత చేయబోయే కొన్ని సినిమాల కోసం కూడా ఒకేసారి కథలను ఫైనలైజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే నెక్స్ట్ ఎవరితో సినిమా చేసిన కూడా అందులో త్రిష( Trisha ) ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటికే కింగ్( King Movie ) అనే సినిమా వచ్చింది.
ఇక ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ఇంకో సినిమా రాలేదు.కాబట్టి ఇప్పుడు నాగార్జున త్రిష తోమరో సినిమా చేయబోతున్నట్టు వార్తలైతే వస్తున్నాయి.ఇక ప్రసన్న కుమార్ బెజవాడ( Prasanna Kumar Bejawada ) డైరెక్షన్ లో వచ్చే సినిమా కోసమే త్రిషని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక అది కాకపోయినా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చే సినిమాలో కూడా సీనియర్ హీరోయిన్ అవసరం ఉందని తెలుస్తుంది.ఇది రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా కోసం త్రిషని తీసుకోనున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ప్రస్తుతానికి త్రిష విశ్వం భర సినిమాలో నటిస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని కొట్టబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఈ సినిమా కనక సక్సెస్ అయితే నాగార్జునతో చేయబోయే సినిమాకి మార్కెట్ పరంగా కూడా చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యం లో నాగార్జున ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి కలవడం నిజంగా అక్కినేని అభిమానులకు( Akkineni Fans ) సంతోషకరమైన విషయం అనే చెప్పాలి…