సాధారణంగా సినిమా హీరోలు స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్న తరువాత ప్రయోగాత్మక సినిమాల్లో నటించడానికి అస్సలు ఇష్టపడరు.కానీ నాగార్జున మాత్రం తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించడంతో పాటు ఆ సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
నాగార్జున గత సినిమా మన్మథుడు 2 డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు నిర్మాతలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకోవడంలో ఫెయిలైంది.

నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాపైనే నాగ్ ఫ్యాన్స్ సైతం ఆశలు పెట్టుకున్నారు.అయితే వైల్డ్ డాగ్ అనే టైటిల్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే నాగార్జున కూడా వైల్డ్ డాగ్ టైటిల్ నచ్చకపోవడంతో వేరే టైటిల్ పెట్టాడని సూచనలు చేశారట.
వైల్డ్ డాగ్ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆ టైటిల్ పెట్టడానికి గల కారణాలు చెప్పడంతో నాగార్జున కన్విన్స్ అయ్యారట.
నాగార్జునే స్వయంగా వైల్డ్ డాగ్ టైటిల్ గురించి మీడియాతో మాట్లాడుతూ సినిమా టైటిల్ గురించి వివరణ ఇచ్చుకున్నారు.
వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకునే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా కథ కొత్తగా ఉంటుందని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం.నాగార్జున ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను అందిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన బిగ్ బాస్ షోను విజయవంతంగా హోస్ట్ చేసిన నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ సీజన్ 5కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కానుంది.
బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.