మరో రికార్డును తన ఖాతాను అధిరోహించిన కింగ్ కోహ్లీ..!

విరాట్ కోహ్లీఈ పేరు వింటే చాలు క్రికెట్ అభిమానుల్లో ఎక్కడలేని వైబ్రేషన్స్ వచ్చేస్తాయి.

విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడంటే చాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి.

టీమ్ ఇండియా జట్టులో కోహ్లీని ఔట్ చేస్తే చాలు మ్యాచ్ విన్ అయిపోయినట్లే అని భావిస్తారు చాలామంది.అలాగే క్రికెట్ ఆటలో ఎన్నో అవార్డులు, రివార్డులు కోహ్లీ సొంతం అయ్యాయి అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

కోహ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్టాడంటే చాలు పరుగులే పరుగులు.అందుకే కోహ్లీని అందరు ముద్దుగా రన్ మెషీన్ అని పిలుస్తుంటారు.

అలాగే కోహ్లీ చూడడానికి కూడా చాలా స్టైలీష్ గా అలాగే ఎంతో ఫిట్టెనెస్ గా ఉంటాడు.కోహ్లీకీ సోషల్ మీడియాలో సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

Advertisement

ఈ క్రమంలోనే కోహ్లీ ఇప్పుడు ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ లో 150 మిలియన్ల మంది ఫాలోవర్ల మార్క్ ను అధిగమించిన మొట్ట మొదటి భారతీయుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఇంకో విశేషం ఏంటంటే తొలి ఆసియన్‌ గా కూడా మన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం ఒక అరుదైన ఘనత సాధించాడు.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఫోటో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ లో 150 మిలియన్ల ఫాలోవెర్స్ ను చేరుకున్న నాలుగో క్రీడా ప్రముఖుడిగా కోహ్లీ నిలిచాడు.

మొదటగా 337 మిలియన్ ఫాలోవర్స్‌ తో ప్రముఖ ఫుట్‌ బాల్ ప్లేయర్ రొనాల్డో మొదటిస్థానంలో ఉండగా.లియోనెల్ మెస్సీ 260 మిలియన్ మిలియన్ ఫాలోవెర్స్ తో రెండవ స్థానంలోనూ, నేమార్ 160 మిలియన్ ఫాలోవర్స్‌తో మూడవ స్థానంలో ఉన్నారు.

ఇప్పుడు నాల్గవ స్థానంలో మన కోహ్లీ ఉండడం విశేషం అనే చెప్పాలి.ఇన్‌స్టాగ్రామ్‌ లో 75 మిలియన్ల మంది ఫాలోవర్లు కోహ్లీకి ఉన్నారు.అలాగే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే కాకుండా ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ లలో కూడా కోహ్లీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

అంతేకాకుండా సినిమా స్టార్స్ ను కూడా వెనక్కి నెట్టి మరి తన ఫాలోయింగ్ తో ముందుకు దూసుకుని పోతున్నాడు.విరాట్ కోహ్లీ స్పాన్సర్ చేసే ప్రతీ పోస్ట్‌పై దాదాపు రూ.5 కోట్లు వరకు తీసుకుంటాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు