ఏంటో ఈమధ్య.స్టార్ సెలబ్రెటీలు న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.
ఇటీవలే రణవీర్ సింగ్ షేర్ చేసిన తన న్యూడ్ ఫోటో ఎంత వైరల్ గా మారిందో చూసాం.దీంతో ఆయన పంపిన ఫోటోలను చూసి చాలామంది దారుణమైన కామెంట్లు పెట్టారు.
మరికొందరు ఆయనకు మద్దతు పలికారు.కొందరు మాత్రం ఈయన చేసిన న్యూడ్ షో వల్ల ఇతర సెలబ్రిటీలను కూడా మధ్యలోకి లాగుతున్నారు.
రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోలు షేర్ చేయటంతో.ఓ ఎన్జిఓ ఆయనపై కేసు వేశారు.దీంతో రణ్ వీర్ మద్దతురాలు.బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ఫోటో షేర్ చేస్తూ మరి ఈ ఫోటో ఎందుకు మనోభావాలను గాయపరచడం లేదు అంటూ కామెంట్ చేశారు.
దీంతో ఈ విషయం గురించి తాజాగా ఉర్ఫీ జావేద్ రంగంలోకి దిగి పలు వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఉర్ఫి జావేద్ గురించి సినీ లవర్స్ కు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.
పలు వివాదాలను తట్టి లేపడం లో సంచలనానికి మారు పేరని చెప్పాలి.ఇక బుల్లితెర ఎంట్రీతో బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.మేరీ దుర్గ్ అనే సీరియల్ లో మెయిన్ రోల్ చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అదే క్రమంలో పలు సీరియల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి బి టౌన్ లో అంతగా గుర్తింపు రాలేదు.ఆ తర్వాత బిగ్ బాస్ ఒటీటీ వెర్షన్ లో ఎంపికై అడపాదడపా కొంతవరకూ గుర్తింపు సంపాదించుకుంది.కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను ఎంతో కాలం మెప్పించలేకపోయింది.
ఇక ఈమె సోషల్ మీడియాలో తన ఫోటోలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.
తనకు ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చిన కూడా అస్సలు పట్టించుకోదు.ఎప్పుడు ఏదో ఒక హాట్ లుక్ తో కనిపించి అందరికి షాక్ ఇస్తుంది.
పైగా వాటిని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బాగా ట్రెండ్ చేస్తుంది.నిజానికి ఈమె రోడ్డుపై అడుగుపెడుతుంది అంటే చాలు.
కెమెరాలు అన్ని ఆమె వైపుకి మల్లాల్సిందే.

ఈ బ్యూటీ చాలా వరకు తన డ్రెస్ లతోనే హాట్ టాపిక్ గా మారుతుంది.ఆమె వేసే డ్రెస్సులను చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు నోరెళ్లబెడతారు.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకోగా.
వెండితెర పై కూడా మెరవాలని బాగా ప్రయత్నిస్తుంది.చాలా వరకు ఈమె ప్రతి విషయంలో బాగా హైలెట్ గా నిలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె వేసుకునే బట్టలు మనోభావాలు దెబ్బతీసేలా ఉంటాయి అని.దీంతో రణవీర్ మద్దతురాలు.గతంలో ఉర్ఫీ జావేద్ తన ప్రైవేట్ పార్ట్ లకు పువ్వులను అడ్డుపెట్టుకొని దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.రణవీర్ ఫోటో మనోభావాలను గాయపరిస్తే.
మరి ఉర్ఫి జావేద్ ఫోటో ఎందుకు మనోభావాలను గాయపరచడం లేదు అంటూ కామెంట్ చేశారు.

దీంతో ఉర్ఫి స్పందిస్తూ.రణవీర్ సింగ్ కు మీరు మద్దతు తెలియజేయాలి అనుకుంటే చేసుకోవచ్చు.కానీ ఆ వివాదంలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు అంటూ ప్రశ్నించింది.
అంతేకాకుండా చాలామంది తనను జాలి, దయ లేకుండా ట్రోల్ చేశారు అంటూ.కొందరు తనను రేప్ చేస్తామని మరికొందరు చంపేస్తామని బెదిరించారు అంటూ.
ఆయనకు వ్యతిరేకంగా ఓ స్టుపిడ్ ఎన్జీవో కేసు వేస్తే వివాదంలోకి నన్ను లాగుతున్నారు.ఇది మీ హిప్పోక్రసీని చూపిస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.