వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ మ్యాచ్‌లో విండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
బుమ్రా వేసిన 11 ఓవర్లో విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ తన అతి తెలివిని ప్రదర్శించాడు.కానీ చివరికి నవ్వుల పాలయ్యాడు.
అసలు ఏమైంది అంటే.?

బుమ్రా వేసిన నాలుగో బంతిని పొలార్డ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.అది బ్యాట్ అంచుకు తగిలి అక్కడే గాల్లోకి లేచింది.ఈ క్యాచ్ అందుకోవడానికి బుమ్రా వెళ్లగా పొలార్డ్ అతని దృష్టిని మరల్చేలా చేయిని కదిపాడు.
అయినా క్యాచ్ అందుకున్న బుమ్రా పొలార్డ్ వైపు ఆగ్రహంగా చూశాడు.అతను మాత్రం నవ్వుతూ క్రీజును వదిలాడు.