హోలీ వేడుకులను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.హోలీ వేడుకల్లో పెద్దలు చేసే అల్లరి కన్నా పిల్లలు చేసే అల్లరి నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.
ఒక్కోసారి ఈ పిల్లల అల్లరి శృతి మించుతుంది కూడా! అయితే తాజాగా ఓ పిల్లాడి హోలీ సెలబ్రేషన్స్ అంతకు మించి అనేలా ఉన్నాయి.దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
దానిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.వీడు మామాలోడు కాదంటూ ఓ రేంజ్ పొగిడేస్తున్నారు.
వాడు ఆ రేంజ్ లో తన రివెంజ్ ని తీసుకున్నాడు.ఆ వీడియోని ఇప్పుడు మనం చూసేద్దాం.
సాధారణంగా పిల్లలు తమ వద్ద హోలీ రంగులు లేకపోతే వేరే వారి వద్ద నుంచి లాక్కొని మరి చల్లుకుంటారు.కానీ ఆ పిల్లాడి వద్ద రంగులు అయిపోయాయి.
మిగతా పిల్లలందరూ ఆ పిల్లవాడిపై రంగులను చల్లారు.దాంతో ఏం చేయాలో ఆలోచించి, ఊహించిన రీతిలో వారిపై రీవెంజ్ తీసుకున్నాడు.
తన వద్ద రంగు నీరు అయిపోవడంతో పక్కనే ఉన్న డ్రెయినేజీలో హోలీ స్ప్రే చేసే గన్ లోకి ఎక్కించాడు.వెంటనే అక్కడ ఉన్న వారందరిపై స్ప్రే చేశాడు.
ఆ పిల్లోడు చేసిన పనికి అక్కడున్న వారంతా షాక్ కు గురియ్యారు.
ఈ సీన్ ను అంతా ఒకరు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వదిలారు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఇది నెక్ట్స్ లెవల్ హోళీ అంటూ పలువురు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
ఓ పిల్లవాడు తన రీవెంజ్ ను ఈ విధంగా తీసుకోవడంపై చాలామంది ఫన్నీగా సమాధానం చెబుతున్నారు.ఇక హోలీ ఇలాగే జరుపుకోవాలేమో అని పలువురు నోరెళ్లబెడుతున్నారు.







