ఆ విషయంలో నాకు నేనే పోటీ... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నటి కీయారా!

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి కియారా అద్వానీ(Kiara Advani) ఒకరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె పెళ్లి తర్వాత కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

 Kiara Advani Interesting Comments On Her Acting Career Details, Kiara Advani,gam-TeluguStop.com

ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్(Game Changer) సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా హృతిక్ రోషన్ వార్ 2(War 2) సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగే ప్రతి ఒక్క నటికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి.అందుకే కెరియర్ పరంగా ఇతరులతో తాను పోటీ గురించి ఏమాత్రం ఆలోచించనని తెలియజేశారు.నటన విషయంలో( Acting ) నాకు నేనే పోటీగా ఉంటానని ఈమె తెలిపారు.

నటనపరంగా గత ఏడాది కంటే ఈ ఏడాది నాలో ఎంతవరకు మార్పు వచ్చిందనేది తనకు ముఖ్యమని తెలియజేశారు.

ఈ విధంగా నాతో నేనే పోటీ పడుతూ ఉత్తమ నటిగా( Best Actress ) పరివర్తన పొందే క్రమాన్ని ఆస్వాదిస్తున్నానని తెలియజేశారు.ఇలా కాలం గడుస్తున్న కొద్ది మన కెరియర్ పట్ల మార్పు ఉండాలి లేకపోతే సమయం వృధా అని తెలియజేశారు.అయితే కెరియర్ మొదట్లో నేను సినిమాల ఎంపిక విషయంలో తీసుకునే నిర్ణయాలతో పోలిస్తే ఇప్పుడు ఎంతో మంచి కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారని అందులో నేను పరిణితి పొందడంతో ఒక నటిగా నాకు ఎంతో గర్వంగా ఉంది అంటూ ఈ సందర్భంగా కీయారా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube