అంతా చరణ్ పుణ్యమే అంటోన్న కియారా!

బాలీవుడ్‌లో ఎంఎస్ ధోనీ బయోపిక్ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కియారా అద్వానీ, ఆ తరువాత వరుబెట్టి ఆఫర్లు చేజిక్కించుకుంటూ దూసుకుపోతుంది.ఇప్పటికే పలు భాషల్లో ఆమె సినిమాలు చేస్తూ యమబిజీగా మారింది.

 Kiara Advani First Pan India Movie Rc15, Kiara Advani, Ram Charan, Rc15, Shankar-TeluguStop.com

ఇటు తెలుగులో కూడా అమ్మడు రెండు స్ట్రెయిట్ చిత్రాల్లో నటించింది.సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘భరత్ అనే నేను’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో అమ్మడు కనిపించింది.

అయితే ఆ తరువాత మరే తెలుగు సినిమాలో ఈమె కనిపించలేదు.

బాలీవుడ్‌లో యమబిజీగా ఉండటమే దీనికి కారణమని చెప్పాలి.

అయితే ఇన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న అమ్మడికి తొలి పాన్ ఇండియా మూవీ మాత్రం ఇంకా పడలేదు.దీంతో ఇప్పుడు ఆమెకు ఆ సదావకాశం దక్కిందని మురిసిపోతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో 15వ చిత్రాన్ని సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో అత్యంత భారీ స్థాయిలో తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాను స్టార్ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తో్న్న సంగతి కూడా తెలిసిందే.

మొత్తానికి చాలా సినిమాలు చేసిన తరువాతగానీ కియారా అద్వానీకి పాన్ ఇండియా మూవీ చేసే అవకాశం రావడంతో ఇప్పుడు ఆమె ఫుల్ హ్యాపీగా ఉందట.

ఇక గతంలో చరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’లో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరినా ఆ సినిమా ఫెయిల్యూర్ కావడం ఆమెను నిరాశపరిచినట్లు తెలుస్తోంది.మరి ఈసారి పాన్ ఇండియా సినిమా కోసం చరణ్‌తో కలిసి రెచ్చిపోయి నటించేందుకు కియారా భారీ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube