మార్కెట్లో విడుదలైన కియా ఈవీ 9.. ధర, ఫీచర్స్ ఇవే..!

దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల కంపెనీ( Kia car company ) 2021లో కియా ఈవీ 6 ను విడుదల చేసి వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది.

ఈ క్రమంలోనే కియా కంపెనీ కియా ఈవీ 9 తాజగా మార్కెట్లో విడుదల అయ్యింది.

ప్రస్తుతం పర్యావరణ సమస్యల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి వచ్చాయి.పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి పెట్టడంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల( Electric vehicles ) హవ నడుస్తోంది.

అయితే ఈ కారు ముందుగా కొరియాలో విడుదల అయింది.త్వరలోనే యునైటెడ్ స్టేట్స్, యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.ఈ మోడల్ ధర రూ.46.8 నుంచి రూ.52.5 లక్షల వరకు ఉండనుంది.

ఇక ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే చార్జింగ్ పెట్టి వాహనాలలో ది బెస్ట్ అయ్యే అవకాశం ఉంది.కేవలం ఏడు నిమిషాలలో 80% చార్జింగ్ పూర్తి అవుతుందంట.ఎందుకంటే ఇందులో 77.4K లిథియం- అయాన్ పాలిమర్ బ్యాటరీ( Lithium-ion polymer battery ) ప్యాక్ తో వస్తుంది.కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో ఉండే ఎలక్ట్రిక్ వాహనాలకు, ఈ ఎలక్ట్రిక్ కారుకు మధ్య తేడా చాలానే ఉండనుంది.

Advertisement

ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే ఏకంగా 483 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

కాకపోతే ఈ కారు కంటే ముందు విడుదల అయినా ఈవీ6 ఏకంగా 501 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది.ఇక ఈ కారులో గ్రిల్ పై పిక్సెల్ ఎల్ఈడి లైట్లు ఎంతో ఆకర్షిస్తాయి.ఇక ఈ కారు పూర్తిగా E-GMP ఆధారపడుతుంది.కియా కంపెనీ అంతర్జాతీయంగా విక్రయాలు జరిపించడం కోసం ఏకంగా ఒకేసారి లక్ష కార్లను ఉత్పత్తి చేస్తుంది.2026 నాటికి 10 లక్షల కియా ఈవీ 9 కార్లను విక్రయించడమే కంపెనీ ప్రధాన లక్ష్యం.

Advertisement

తాజా వార్తలు