ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తముల కన్నడ ఇండస్ట్రీలలో కూడా సినిమాలోని రిలీజ్ అవుతున్నాయి.ఇప్పటికే చాలా సినిమాలు తెలుగులోకి రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు.అలాగే అప్పట్లో పర్వాలేదనిపించుకున్న సినిమాలను సైతం మళ్లీ రిలీజ్ చేయగా మంచి వసూళ్లు రాబట్టాయి.
![Telugu Gilli, Jersey, Kollywood, Kushi, Pawan Kalyan, Break, Vijay-Movie Telugu Gilli, Jersey, Kollywood, Kushi, Pawan Kalyan, Break, Vijay-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/kushi-movie-gilli-movie-record-break-Jersey-vijay-pawan-kalyan.jpg)
కాగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, సిద్ధార్థ్, బాలకృష్ణ లాంటి హీరోలు నటించిన సినిమాలు తెలుగులోకి విడుదల అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి.రీసెంట్ గా తెలుగులో నాని జెర్సీ మూవీ( Jersey ) రీరిలీజ్ అయ్యింది.రీ రిలీజ్ అయిన సినిమాలకి మంచి కలెక్షన్స్ వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ అసోసియేషన్స్, కొంత మంది చిన్న నిర్మాతలు పాత హిట్ మూవీస్ ని కొనుగోలు చేసి రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇలా రీరిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి( Kushi movie ) అని పేరు వినిపించేది.
![Telugu Gilli, Jersey, Kollywood, Kushi, Pawan Kalyan, Break, Vijay-Movie Telugu Gilli, Jersey, Kollywood, Kushi, Pawan Kalyan, Break, Vijay-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/04/gilli-movie-record-break-kollywood-Jersey-vijay-pawan-kalyan.jpg)
ఆ సినిమా న్యూ ఇయర్ వీకెండ్ లో రిలీజ్ అయ్యి ఏకంగా 7.46కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.పది రోజుల పాటు ఖుషి చిత్రాన్ని థియేటర్స్ లో ప్రదర్శించారు.ఖుషి కలెక్షన్స్ రికార్డ్ ని ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ మూవీ బ్రేక్ చేయలేకపోయింది.అయితే ఈ ట్రెండ్ లో కోలీవుడ్ నుంచి ఇళయదళపతి విజయ్ సూపర్ హిట్ మూవీ గిల్లి( Ghilli ) ఇప్పుడు బ్రేక్ చేయడం విశేషం.సూపర్ స్టార్ మహేష్ సూపర్ హిట్ మూవీ ఒక్కడు రీమేక్ గా తమిళంలో గిల్లి తెరకెక్కింది.
తాజాగా గిల్లి చిత్రాన్ని తమిళనాట రీరిలీజ్ చేశారు.ఈ సినిమాకి దళపతి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.దీంతో ఒక్క రోజులోనే ఈ మూవీకి 7.92 కోట్ల గ్రాస్ వచ్చింది.పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రికార్డ్ ని దళపతి గిల్లి మూవీ ఒక్క రోజులోనే జెట్ స్పీడ్ లో బ్రేక్ చేయడం విశేషం.ఈ సినిమా మరికొద్ది రోజులు థియేటర్స్ లో ప్రదర్శితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో డబుల్ డిజిట్ కలెక్షన్స్ ని గిల్లి అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.