గుండె బరువెక్కింది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నాచురల్ స్టార్ నాని?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు నాచురల్ స్టార్ నాని( Nani )ఒకరు.ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

 Nani Emotional Post About Jersey Movie Re Release,nani,jersey Movie,gautham Thin-TeluguStop.com

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి నాని సోషల్ మీడియా వేదికగా గుండె బరువెక్కింది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

నాని ఇలా ఎమోషనల్ పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాలు క్రితం నాని గౌతమ్ తిన్ననూరి ( Gautham Thinnanuri ) దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం జెర్సీ ( Jersey )ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఐదు సంవత్సరాలు కావడంతో తిరిగి ఈ సినిమానే హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో విడుదల చేశారు.

స్పెషల్ షో చూడటానికి నాని తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.అయితే ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాకి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి అదే ఆదరణ లభించిందని చెప్పాలి.ఈ విధంగా ఈ సినిమాకి భారీ స్థాయిలో అభిమానులు ఈలలు వేస్తూ గోల చేస్తూ ఈ సినిమాని ఎంజాయ్ చేశారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకి నేషనల్ అవార్డు( National Award ) రావడం కూడా విశేషం.

ఇలా ఈ సినిమాకు అదే స్థాయిలో ఆదరణ రావడంతో ఈయన సోషల్ మీడియా( Social Media ) వేదికగా ఈ సినిమాకి వస్తున్నటువంటి ఆదరణ గురించి స్పందిస్తూ గుండె బరువెక్కింది.అభిమానుల ప్రేమతో మనసు నిండిపోయింది అంటూ ఈ సినిమాని ఇంతగా ఆదరించినటువంటి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ నాని షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక నాని ప్రస్తుతం సరిపోలేదా శనివారం అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు, త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube