ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన కె.జి.
ఎఫ్ మొదటి రెండు పార్ట్ లతో కన్నడలోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు యశ్.తెలుగులో అతనికి దాదాపు ఇక్కడ స్టార్ హీరో రేంజ్ క్రేజ్ ఏర్పడింది.ఈ క్రమంలో యశ్ పాత సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.యశ్ హీరోగా మహేష్ రావు డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా సంతు స్ట్రైట్ ఫార్వార్డ్.ఈ సినిమాలో యశ్ సతీమణి రాధికా పండిత్ కథానాయికగా నటించారు.2016లో వచ్చిన ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయ్యింది.ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
సంతు స్ట్రైట్ ఫార్వార్డ్ సినిమాను తెలుగులో రారాజుగా రిలీజ్ చేస్తున్నారు.
జూన్ సెకండ్ వీక్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.కె.జి.ఎఫ్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేలా ఈ సినిమాని తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు.రారాజు సినిమాను వి.ఎస్ సుబ్బారావు నిర్మిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ కొద్దిరోజుల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.రారాజు సినిమాకు హరికృష్ణ మ్యూజిక్ అందించగా ఆండ్రూ సినిమాటోగ్రఫీ చేశారు.మరి కె.జి.ఎఫ్ తో మెప్పించిన యశ్ రారాజు గా అలరిస్తాడా లేదా అన్నది చూడాలి.