కేజిఎఫ్ చాప్టర్ 3 గురించి ఓపెన్ అయిన యశ్.. రెండవ పార్ట్ కి మించి ఉంటుందంటూ కామెంట్స్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినిమాలలో కేజిఎఫ్ చాప్టర్ 2 ఒకటి.కోలార్ గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కించుకొని మంచి విజయాన్ని అందుకుంది.

 Kgf 2 Actor Yash Open Comments About Kgf 3 Movie Khg 2, Kgf 3, Yash, Prashanth-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాలో యశ్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారని చెప్పాలి.డైరెక్టర్ స్క్రీన్ ప్లే, యశ్ టెరిఫిక్ నటనకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాకి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను అడగగా ప్రస్తుతం తను కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని వెల్లడించారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన పలువురు తప్పకుండా కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని వారి అభిప్రాయాలను తెలియజేశారు.తాజాగా రాఖీ బాయ్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కేజీఎఫ్ చాప్టర్ 3 గురించి ఓపెన్ అయ్యారు.

Telugu Kgf, Khg, Prashanth Neel, Raveena Tandon, Sanjay Dutt, Srindhi Shetty, Ya

ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ కేజీఎఫ్ చాప్టర్ 2 లో నేను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొన్ని సన్నివేశాలు గురించి చర్చించుకున్నాము.అయితే ఈ సన్నివేశాలను ఈ సినిమాలో పెట్టడం కుదరలేదు.అయితే ప్రస్తుతం ఆ సన్నివేశాల గురించి ఎలాంటి ఆలోచన లేదని యశ్ వెల్లడించారు.ఇకపోతే త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్3 ఉంటుందని ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని యశ్ తెలిపారు.

ఇక థర్డ్ పార్ట్ కేజీఎఫ్ చాప్టర్2 ను మించి ఉంటుంది.అయితే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి కాస్త ఆలస్యం అవుతుందని ఈ సందర్భంగా యశ్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube