ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంగ్లీష్ మీడియం విద్య పెద్దల పిల్లలకే కానీ పేదలకు వద్దా అని ప్రశ్నించారు.
వెంకయ్య నాయుడు, చంద్రబాబు పిల్లలు ఎక్కడ చదివారో చెప్పాలన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సభలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓటు లేని స్కూల్ పిల్లలకు పథకాలు పెట్టిన ఘనత సీఎం జగన్ దేనని కొనియాడారు.గతంలో చంద్రబాబు( Chandrababu naidu )ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదని తెలిపారు.
కానీ జగన్( YS Jagan Mohan Reddy ) పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.







