హైదరాబాద్ లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నగరంలో నిబంధనలు ఉల్లంఘించిన నడుస్తున్న పలు గోదాంలను ఇప్పటికే సర్కార్ గుర్తించింది.
ఈ క్రమంలో గోదాం యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.నోటీసులు అందుకున్న తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపింది.
అంతేకాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ కు ఇకపై పోలీసుల అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.అయితే ఇటీవల రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఆ ఘటనను మరువక ముందే సిటీలో ఒకే రోజు రెండు అగ్నిప్రమాదాలు జరిగాయి.