మన భారతదేశంలో దాదాపు చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శంఖం శబ్దం వస్తే ఇంట్లో పెద్ద మార్పులను గమనించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
రోజు రెండు నుంచి నాలుగు సార్లు శంఖం ఊదడం వల్ల మీ ఇంటి వాతావరణం సానుకూల శక్తితో నిండిపోతుంది.అందుకే మన ఇంట్లో శంఖం తప్పకుండా పెట్టుకోవాలి అని పెద్దవారు చెబుతూ ఉంటారు.
ఇంట్లో శంఖాన్ని ఊదడం ద్వారా మీరు ఇంటి లోపల పెద్ద ప్రభావాన్ని గమనిస్తారు.
అందుకే శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
రోజు శంఖం ఊదడం వల్ల ఇల్లు, ఇంటి పరిసరాలు కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి.శంఖం ధ్వని నుంచి ఓంకారం శబ్దం ఉద్భవిస్తుంది.
దీనివల్ల వాతావరణ సానుకూల శక్తి తో నిండి ఉంటుంది.దీని ద్వారా చుట్టూ వ్యాపించిన ప్రతికూల శక్తిని కూడా నాశనం చేస్తుంది.
శంఖంలో నీటిని నింపి ఇంట్లోనే ప్రతి భాగంలో చల్లాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి దూరంగా వెళ్ళిపోతుంది.
తరచూ గొడవలు జరిగే ఇళ్లలో కూడా శాంతి కలుగుతుంది.అంతేకాకుండా వాస్తు దోషాలు కూడా ఇళ్ల నుంచి దూరమవుతాయి.
ఇంట్లో ప్రతిరోజు శంఖం ఊదడం వల్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మెరుగుపడుతుంది.పురాణాల ప్రకారం శంఖం, లక్ష్మీదేవి సముద్రం మథనం నుంచి ఉద్భవించింది అని చెబుతూ ఉంటారు.దానికి కారణంగా శంఖం లక్ష్మీదేవి తోబుట్టువులు అని చెబుతారు.అంతేకాకుండా శంఖం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది అని కూడా చెబుతారు.అందుకే శంఖం ఉన్న ఇంటి కుటుంబ సభ్యులు అందరూ అదృష్టవంతులు అని చెబుతుంటారు.వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.
అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా గొప్ప ప్రయోజనాలను పొందుతారు.ఇది మీ ఊపిరితిత్తుల, శ్వాసకోశ వ్యాధులను న్యాయం చేస్తుంది.
శంఖం ఊదడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.