విశాఖ వేదికగా జరిగిన “విశాఖ గర్జన” కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది.మూడు రాజధానులలో భాగంగా విశాఖ రాజధానిగా అధికార పార్టీ వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
మరో పక్క ఇదే సమయంలో చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ పలు పార్టీల నాయకులు అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.ఇటువంటి తరుణంలో “విశాఖ గర్జన” కార్యక్రమానికి వచ్చిన వైసీపీ మంత్రులపై విశాఖపట్నం విమానాశ్రయం వద్ద రాళ్ల దాడి చేయడం జరిగింది.
ఇదంతా జనసేన పార్టీ పని అని వైసిపి మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే మంత్రులపై రాళ్లదాడి విషయంపై జనసేన పార్టీ కీలకనేత నాదెండ్ల మనోహర్ స్పందించారు.
దాడి చేసే సంస్కృతి జనసేన ప్రోత్సహించదని అది వైసిపి వాళ్ళు చేసిన పన్నే అని అన్నారు.మంత్రుల మీద దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
గతంలో విశాఖ విమానాశ్రయంలో జగన్ కోడి కత్తి హడావిడి చేశారని.ఆ కేసు ఇప్పటివరకు ఎందుకు తేల్చలేదని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ఇక ఇదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ విశాఖలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు.“జనవాణి” కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు.ఇప్పటికే పవన్ విశాఖకు చేరుకోవడం జరిగింది.