తెలంగాణలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.అక్టోబర్ 10వ తేదీ లోపు నోటిఫికేషన్ వస్తేనే ఎన్నికలని చెప్పారు.
కానీ అక్టోబర్ లో నోటిఫికేషన్ వచ్చేది అనుమానమేనని పేర్కొన్నారు.
అయితే ఈనెలలో నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా తెలంగాణలో 90 స్థానాలకు పైగా బీఆర్ఎస్ పార్టీనే గెలుపు సాధిస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ కే ప్రజలు మరోసారి పట్టం కడతారని ఆయన వెల్లడించారని తెలుస్తోంది.
కాగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.







