ఏపీలో ఎన్నికల దగ్గర పడే రాజకీయ ముఖచిత్రం మారిపోతూ ఉంది.నిన్న మొన్నటిదాకా తెలుగుదేశం మరియు జనసేన కూటమి( TDP Janasena Alliance )గా ఉన్నాయి.
ఆ తర్వాత ఇప్పుడు ఈ కూటమిలో బీజేపీ కూడా జాయిన్ అయ్యింది.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత రెండు రోజులు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరపడం జరిగింది.
గత నెల డిసెంబర్ మొదటి వారంలో ఆల్రెడీ అమిత్ షా, జేపీ నడ్డా( Amit Shah JP Nadda ) లతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.తర్వాత ఇటీవల మళ్ళీ సమావేశం కాగా పొత్తు ఖరారు చేసుకోవడం జరిగింది.
శుక్రవారం రాత్రి నుండి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు.
శనివారం బీజేపీతో పొత్తు( TDP BJP Alliance ) ఖరారు అయినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.2024 ఎన్నికలలో మూడు పార్టీలు కలసి పోటీ చేయబోతున్నాయని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( BJP JP Nadda ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరి కొద్ది రోజుల్లో సీట్ల కేటాయింపు పై ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజల సపోర్ట్ వారి అంచనాలను తమ కూటమి అందుకుంటుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను సర్దుబాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.దీనిపై రేపు లేదా ఎల్లుండి స్పష్టత వచ్చే ఛాన్సుంది.