బీజేపీతో పొత్తు ఖరారు అయినట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) స్పష్టం చేశారు.ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీ( Delhi ) నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.“ఐదు సంవత్సరాలలో జగన్.రాష్ట్రాన్ని దివాలా తీయించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం.ఆర్థికంగా బలపడాలంటే కేంద్రంతో కలిసి అడుగులు వేయాలి.
రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకోవడం జరిగింది.పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహ పడొద్దు.
సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలి.సీట్ల సర్దుబాటుపై.
చర్చలు జరిగాయి త్వరలో స్పష్టత వస్తుంది అని నేతలకు వివరించారు.

అంతేకాకుండా మార్చి 17వ తారీకు చిలకలూరిపేటలో మూడు పార్టీలు నిర్వహించే ఉమ్మడి బహిరంగ సభలో ప్రధాని మోదీ( PM Modi ) పాల్గొంటారని చెప్పారు.ప్రధాని షెడ్యూల్ లో మార్పులు ఉంటే 18న సభ నిర్వహించేందుకు ఏర్పాట్లూ చేయాలని… స్పష్టం చేయడం జరిగింది.2014 ఎన్నికల మాదిరిగా 2024 ఎన్నికలలో టీడీపీ.జనసేన.బీజేపీ కూటమి( TDP BJP Janasena Alliance ) ఏర్పడటంతో.ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.ఏపీలో మరో 40 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.2024 ఎన్నికలను చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.







