ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్ర ఏంటో తేలిపోయిందని తరుణ్ చుగ్ తెలిపారు.ఛార్జ్ షీట్ లో కవిత పేరును ఈడీ ప్రముఖంగా ప్రస్తావించిందన్నారు.
ఎప్పుడెప్పుడు ఎవరు ఎవర్ని కలిశారో ఛార్జ్ షీట్ లో వివరంగా ఉందని చెప్పారు.ఈ కుంభకోణంలో రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారాయని వెల్లడించారు.కేసీఆర్ కుటుంబ పాలన, దోపిడీ, అవినీతికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు.
పది ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఛార్జ్ షీట్ లో ఉందన్న తరుణ్ చుగ్ అన్ని ఫోన్లు ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణ దాటి ఢిల్లీ వరకు చేరిందని విమర్శించారు.







