తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు.తెలంగాణ కోసం రాజీపడకుండా పోరాటం చేశానని తెలిపారు.
ఓడిపోయినా తనకు బాధలేదు కానీ తనపై రేవంత్ రెడ్డి కామెంట్లు చేయడం బాధను కలిగిస్తుందని చెప్పారు.కర్ణాటక ఫలితాలతో తెలంగాణకు సంబంధం లేదన్నారు.
కర్ణాటక ఫలితాల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారని తెలిపారు.కానీ బీజేపీని వీడేది లేదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో కావాలనే తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తమ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు.







