బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.ఈ షో ద్వారా ఎందరో కమెడియన్స్ మంచి గుర్తింపు సంపాదించుకొని వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు.
పైగా ఆర్థికంగా కూడా బాగా సంపాదిస్తూ సొంతంగా కార్లు, ఇల్లులు కొనుగోలు చేస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.ఇక తాజాగా మరో కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా కొత్త ఇల్లు కొనుగోలు చేశాడు.
జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా అడుగుపెట్టిన కెవ్వు కార్తీక్ గురించి అందరికీ పరిచయమే.అందులో తన కామెడీతో మంచి గుర్తింపు అందుకున్నాడు.
ఒక సాధారణ టీమ్ మెంబర్ గా పరిచయమైన కార్తీక్ ఆ తర్వాత తన టాలెంట్ తో టీమ్ లీడర్ గా నిలిచాడు.మొదట్లో కొన్ని టీమ్ లల్లో కమెడియన్ గా నటించాడు.
టీమ్ లీడర్ గా రావడానికి మాత్రం చాలా ఆలస్యంగా వచ్చాడు.తనకంటూ సొంతంగా స్క్రిప్టు రాస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు.

తన కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కార్తీక్.కానీ జబర్దస్త్ తర్వాత మంచి హోదా ను సంపాదించుకున్నాడు.ఆర్థికంగా కూడా బాగా సంపాదించుకుంటున్నాడు.ఇక ఈయన తాజాగా కొత్త ఇల్లును కొనుగోలు చేయగా నూతన గృహప్రవేశం చేశాడు.ఇక ఆ కార్యక్రమం కు రచ్చ రవితో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొని సందడి చేశారు.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తను గృహప్రవేశం సంబంధించిన ఫోటోలను పంచుకోగా పలువురు సెలబ్రెటీలతో పాటు నెటిజన్లు కూడా లైక్ లు కొడుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.







