విజయవాడ: తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తో భేటీ అయిన కేశినేని శ్వేత. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత.
కాసేపట్లో తన పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా.ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో ముందుగా రాజీనామా చేస్తున్న ఆయన కుమార్తె శ్వేత.
గత మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత కు మేయర్ పదవి విషయంలో మొదలైన కేశినేని నాని అసంతృప్తి.
టీడీపీ గెలిస్తే శ్వేత కు మేయర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టిన ఎంపీ నాని.
శ్వేత కు మేయర్ పదవి ఇవ్వొద్దని వ్యతిరేకించిన మరో వర్గం.అప్పటినుంచి అధిష్టానం,వ్యతిరేక వర్గంపై విమర్శలు మొదలు పెట్టిన ఎంపీ నాని.
రెండు రోజుల క్రితం తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎంపీ.ముందుగా తన కూతురు శ్వేత చేత రాజీనామా చేయిస్తున్న నాని.
కేశినేని శ్వేత కామెంట్స్.కార్పొరేటర్ పదవి కి ముందుగా రాజీనామా చేస్తున్నాను.
ఆ తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేస్తాను.నాకు కార్పొరేటర్ ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ బీ ఫామ్ ఇచ్చారు.ముందుగా ఆయనకు ధన్యవాదాలు చెప్దామని వచ్చాను.మిగిలిన విషయాలు రాజీనామా తర్వాత మాట్లాడతాను.
కుటుంబాల పరంగా మాకు రిలేషన్స్ ఉన్నాయి.మా నాన్నగారి రాజీనామా వ్యవహారంపై చర్చ జరగలేదు.