విజయవాడ రాజకీయాల్లో ఇటీవల కేశినేని నాని( Kesineni Nani ) వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె శ్వేత( Kesineni Swetha ) కూడా పదవికి రాజీనామా చేయనున్నారు.
కేశినేని నాని ఎంపీ పదవికి, ఆయన కుమార్తె శ్వేత విజయవాడ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయాన్ని కేశినేని నాని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆ తరువాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే ఇవాళ శ్వేతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన కార్పొరేటర్ పదవికీ రాజీనామా చేస్తారని చెప్పారు.ఆ మరుక్షణమే టీడీపీ( TDP ) ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుందని తెలిపారు.తరువాత ఫిబ్రవరిలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు.