ఆ కుక్క చాలా అదృష్టవంతురాలు... దాని ఆరోగ్యం కోసం గ్రామ ప్రజలంతా ప్రార్ధనలు చేశారు?

అవును, ఆ కుక్క చాలా అదృష్టవంతురాలు.ఎంత అదృష్టవంతురాలంటే, దాని ఆరోగ్యం కోసం ఆ వూరి ప్రజలంతా ప్రార్ధనలు చేశారు.

 Kerala Village People Came Together To Save A Dog With Tumor Details, Dog, Viral-TeluguStop.com

ఓ భారీ కణితి కారణంగా నరకయాతన అనుభవిస్తున్న ఈ శునకానికి సర్జరీ చేయించేందుకు ఆఊరి ప్రజలు ఏకమయ్యారు.వివరాల్లోకి వెళితే, కాసర్‌గోడ్‌లోని కోడోం-బెల్లూర్ గ్రామ పంచాయితీలోని చుల్లిక్కర గ్రామంలో ముత్తుమణి అనే ఒక ఆడ కుక్క నివసిస్తోంది.

ఇండియన్ పరియా డాగ్ అనే జాతికి చెందిన ఈ శునకం ప్రతి సంవత్సరం అందమైన కూనలకు జన్మనిస్తుంది.అలా జన్మనిచ్చిన కూనలను ఆ వూరి ప్రజలు పెంచుకుంటూ వుంటారు.

పిల్లలను కనే క్రమంలో ఆ శునకానికి రొమ్ముల వద్ద ఒక వాపు కనిపించింది.వారం రోజుల వ్యవధిలోనే ఆ వాపు పెద్దగా మారడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు.

దాంతో దానిని రాజపురంలోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ ఒక డాక్టర్ సిరంజితో వాచిన శరీర భాగం నుంచి ఓ ద్రవాన్ని వెలికితీశారు.

దీంతో కుక్క రొమ్ముల వద్ద వాపు కాస్త తగ్గింది.వాపు తగ్గడం చూసి గ్రామస్థులు కాస్త కుదుట పడ్డారు.

అయితే వారి సంతోషం మూన్నాళ్ళ ముచ్చటే అయింది.ఒక వారం రోజుల వ్యవధిలోనే ఆ వాపు ఎప్పట్లాగానే పెద్దగా తయారవడంతో మరొకసారి ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు.

Telugu Dog Muttumani, Humanity, Kasargod, Kerala, Save Dog Tumor, Veterinary, La

ఓ డాక్టర్ సూచనతో వారు మరో ఆసుపత్రికి తరలించారు.అక్కడి వైద్యులు ముత్తుమణి క్షీరరసగ్రంధి కణితితో బాధ పడుతుంది అని చెప్పారు.అనంతరం శస్త్రచికిత్స చేసి 5 కిలోల బరువున్న క్షీరరసగ్రంధి కణితిని వారు తొలగించారు.ప్రస్తుతం ముత్తుమణి ఆరోగ్యం నిలకడగా ఉందని అక్కడి సర్జన్ తెలిపారు.సీనియర్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ ఎ మురళీధరన్ మాట్లాడుతూ కణితి ముత్తుమణి వీపును వంచి దాన్ని బాగా కృంగదీసింది అన్నారు.ప్రస్తుతం ఈ కుక్క ఇప్పుడు త్రికరిపూర్ వెటర్నరీ హాస్పిటల్‌లోని ఏబీసీ సెంటర్ షెల్టర్‌లో కోలుకుంటుంది.

దాంతో ఆ గ్రామస్థులు ఊపిరి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube