ఢిల్లీలో ఎంపీల పోటీ విషయంలో కాంగ్రెస్ పై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు..!!

జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఈసారి కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎలాగైనా ఓడించడానికి ఇప్పటికే పలు పార్టీలను కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది.

 Kejriwal's Key Comments On Congress Regarding Mp Contest In Delhi , Aap, Congres-TeluguStop.com

ఈ రకంగా కలిసిన పార్టీలన్నీ “ఇండియా” కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికలలో కలసి పనిచేయటానికి రెడీ అవుతున్నాయి.ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన పార్టీలు చాలా సందర్భాలలో సమావేశం కావడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇదే “ఇండియా” కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) కూడా భాగస్వామ్యం కావడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఢిల్లీ పార్లమెంట్ మొత్తం స్థానాలు ఏడు చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ( Kejriwal )తప్పుపట్టారు.

కూటమిలో ప్రధాన పార్టీనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆప్ అభ్యంతరం తెలిపింది.ఒంటరిగా పోటీ చేయాలనుకున్నప్పుడు పెట్టిన కూటమికి అర్థం లేదని స్పష్టం చేశారు.ఈ పరిణామంతో ఇండియా కూటమిలో సీట్ల గొడవ అప్పుడే స్టార్ట్ అయిన పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube