Keerthy Suresh Casting Couch : మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన కీర్తి సురేష్.. అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిన సత్యం.ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా క్యాస్టింగ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది నటి మనులు ఈ విషయం గురించి స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Keerthy Suresh Who Responded On The Casting Couch For The First Time , Keerthy S-TeluguStop.com

అయితే ఇది సిని బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బందులు ఉండవని మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి కీర్తి సురేష్ గురించి అందరికీ సుపరిచితమే.

ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు తమిళ భాషలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇకపోతే తాజాగా కీర్తి సురేష్ కె.జి.ఎఫ్ నిర్మాణ సంస్థలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు మొదటిసారిగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురయింది.ఒకవేళ మీకు సినిమా అవకాశం రావాలంటే తప్పనిసరిగా కమిట్మెంట్ కి ఒప్పుకోవాల్సిందే.

ఇలా ఒప్పుకుంటేనే అవకాశం ఇస్తామని చెప్పినప్పుడు మీ సమాధానం ఎలా ఉంటుంది అని యాంకర్ ప్రశ్నించారు.

Telugu Keerthy Suresh-Movie

ఈ ప్రశ్నకు కీర్తి సురేష్ సమాధానం చెబుతూ.కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తాము అంటే ఆ అవసరం నాకు లేదని వెంటనే ఇండస్ట్రీ నుంచి దూరమై ఏదైనా మంచి జాబ్ చేసుకుంటానని కానీ అలాంటి వాటికి ఒప్పుకోనని ఈమె తెలిపారు.ఇండస్ట్రీలో చాలామంది ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడ్డారని చాలామంది నాతో చెప్పారు.

అయితే తన వరకు ఇలాంటివి ఎప్పుడూ ఎదురు కాలేదని తెలిపారు.అయితే ఏదైనా కూడా మన బిహేవియర్ బట్టే ఉంటుందని నాకే కనుక ఇలాంటి ఇబ్బందులు కనక ఎదురై ఉంటే ఆ క్షణమే సినిమాలకు దూరమై ఉండేదాన్ని అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube