పెంగ్విన్ టీజర్ టాక్: సస్పెన్స్ థ్రిల్లర్‌తో వస్తున్న కీర్తి

మహానటి చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ కీర్తి సురేష్, ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

ఇదివరకు కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ బ్యూటీ, తాజాగా పెంగ్విన్ అనే సినిమాను తెరకెక్కిస్తోంది.

తమిళంలో సూపర్ సక్సెస్ అందుకుంటున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ భావించినా, లాక్‌డౌన్ కారణంగా అది కుదరలేదు.

Keerthy Suresh Penguin Teaser, Keerthy Suresh, Penguin Movie, Keerthy Suresh Pen

కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ టీజర్ చూస్తుంటే ఇదొక పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కినట్లు తెలుస్తోంది.

వరుసగా జరిగే హత్యలు, వాటి వెనకాల ఉన్న హంతకులు ఎవరనే విషయాలను ఈ సినిమాలో మనకు చూపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇక కీర్తి సురేష్ కూడా ఈ హత్యలకు కారణమైన వారి వల్ల తన కొడుకును కోల్పోవడం, వారిని పట్టుకునేందుకు ఆమె వంతు ప్రయత్నం చేయడం లాంటివి ఈ సినిమాలో మనకు కనిపించనున్నాయి.

Advertisement

మొత్తంగా చూస్తే ఈ సినిమా ఒక పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వస్తుండగా, కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈశ్వర్ కార్తిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

మరి పెంగ్విన్ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఎందుకు పెట్టారో తెలియాలంటే మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాను థియేటర్స్ లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 19న రిలీజ్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు