తెలుగులో మహానటి చిత్రంతో తన స్థాయిని అమాంతం పెంచేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.అంతకు ముందు చేసిన సినిమాలు ఆమెకు అంత గుర్తింపు తీసుకురాలేదనే చెప్పాలి.
కానీ సావిత్రి బయోపిక్‌తో కీర్తి సురేష్‌కు చాలా మంచి పేరు వచ్చింది.దీంతో వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
ఈ క్రమంలో కేవలం సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు రెడీ అయ్యింది కీర్తి సురేష్.
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ హీరోగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ మైదాన్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు చిత్ర యూనిట్.కానీ తాజాగా ఈ సినిమా నుండి కీర్తి సురేష్ వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.అమిత్ శర్మ డైరెక్ట్ చేస్తు్న్న ఈ సినిమా నుండి కీర్తి సురేష్ వాకౌట్ చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఏదేమైనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన కీర్తి సురేష్, ఇలా వాకౌట్ చేయడంతో ఆమె ఎందుకిలా చేసిందా అంటూ తలలు పట్టుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.
మరి కీర్తి సురేష్ బాలీవుడ్ ఆఫర్‌ను వదులుకోవడం వెనుక అసలు కారణం ఏమిటో ఆమె నోటితో చెప్పేవరకు వేచి చూడాల్సిందే.







