టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాటకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇటీవల రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి న్యూస్ వచ్చినా వదలకుండా ఫాలో అవుతున్నారు.
కాగా ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడనే విషయం ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా చాలా మంది పేర్లు వినిపించినా, చివరకు కీర్తి సురేష్ ఫైనల్ అయ్యింది.
ఈ సినిమాతో మరోసారి స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్‌ను కొట్టేసింది ఈ బ్యూటీ.అయితే ఇటీవల కీర్తి సురేష్ నటించిని సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో, సర్కారు వారి పాటతో తిరిగి అదిరిపోయే సక్సె్స్ ట్రాక్ ఎక్కాలని ఈ బ్యూటీ చూస్తోంది.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ బ్యాంకు ఉద్యోగినిగా నటిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ పాత్ర కోసం అమ్మడు చాలా వర్కవుట్ చేస్తోందట.
ఇటీవల పెంగ్విన్ చిత్రంలో కనిపించిన కీర్తి సురేష్ చాలా నీరసంగా కనిపించడంతో, మహేష్ సరసన నటించే సినిమా కోసం ఆమె బరువెక్కేందుకు రెడీ అయ్యింది.దీంతో ఆమె బరువు పెరిగేందుకు తెగ కష్టపడుతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమాను గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ ప్రారంభించాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.







