Keerthy Suresh : దసరా సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్.. వీడియో చూస్తే?

టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని( Nani ), హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) జంటగా నటించిన తాజా చిత్రం దసరా( Dasara ).ఇటీవలే శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకొని దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Keerthy Suresh Enjoying Dasara Movie Blockbuster-TeluguStop.com

భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఇకపోతే కీర్తి సురేష్, నాని ఇద్దరు నేను లోకల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

నేను లోకల్ సినిమా తర్వాత నటించిన చిత్రం దసరా.

మొట్టమొదటిసారిగా మాస్ లుక్ లో కనిపించిన నాని అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ నటనతో అదరగొట్టేశారు.సినిమాలో ఇద్దరి నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.సినిమా విడుదల అయినా తొలిరోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.కాగా ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఇప్పటికే హీరో నాని సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.

మహానటి సినిమా తర్వాత మళ్లీ చాలెంజింగ్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది కీర్తి సురేష్.డీ గ్లామర్ రోల్ నూ తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.దసరా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సందర్భంగా కీర్తి సురేష్ ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది.

నేపథ్యంలోనే తాజాగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.దసరా సెట్స్ లో కీర్తి సురేష్ గంతులేస్తూ కారు వద్దకు వెళ్లిన ఒక వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఆ వీడియోను షేర్ చేస్తూ తాను కూడా సంతోషంతో గంతులేస్తున్నట్టుగా తెలిపింది.దసరాపై అందరూ చూపించిన ప్రేమకు వెన్నెల చాలా సంతోషంగా గంతులు వేస్తుందని చెప్పుకొచ్చింది కీర్తి.

కాగా కీర్తి సురేష్ షేర్ చేసిన ఆ వీడియో పై స్పందించిన హీరోయిన్ మృనాల్ క్యూటీ అంటూ కామెంట్ చేసింది.సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా స్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube