తెలంగాణలో ఎలక్షన్ టైమ్ కావడంతో అధికార బిఆర్‌ఎస్ ( BRS )మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది.అయితే గతంతో పోల్చితే ఈసారి బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గట్టిగానే పోటీనిచ్చేటట్లు కనిపిస్తున్నాయి.
అందుకే ఈసారి మరింత జాగ్రత్తగా ప్రత్యర్థులను ఎదుర్కోవాలని కేసిఆర్ ( CM kcr )భావిస్తున్నారట.ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన చేజెతులా అధికారం కోల్పోయినట్లే అనే డౌట్ అధినేత మెదులుతున్నట్లు తెలుస్తోంది.
అందుకే పార్టీలో లొసుగులకు చోటివ్వకుండా ఎన్నికలకు మూడు నెలల ముందే తొలి జాబితాను ప్రకటించారు గులాబీ బాస్.అది కూడా ఏకంగా 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇక మిగిలిన నాలుగు స్థానాలను ఈ రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.అయితే అభ్యర్థుల ప్రకటన రాగానే అసంతృప్త వాదుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వడం సహజం.అందువల్ల ఎన్నికలకు చాలా టైమ్ భావనతో ఆలోపు బుజ్జగింపు చర్యలు చేపట్టవచ్చని కేసిఆర్ ( CM kcr )భావిచ్చారు.కానీ అభ్యర్థుల ప్రకటన వెలువడి 40 రోజులు దాటిన అడపాదడపా ఇంకా అసమ్మతి వాదులు గళం వినిపిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే సీటు దక్కని కొంతమంది వేరే పార్టీల గూటికి చేరుకున్నారు.సీటు దక్కిన మైనంపల్లి హనుమంతరావు( Mynampally Hanumanth Rao ) వంటి వారు సైతం పార్టీని విడారు.

దీంతో ఈ పరిణామాలు ఎంతో కొంత పార్టీని నష్టం కలిగించేలానే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక సీటు దగ్గిన అభ్యర్థులు సైతం ప్రజల్లో యాక్టివ్ గా ఉండకుండా తరచూ హైదరబాద్ కు వస్తు వెళ్తూ ఉందాంతో అధినేత కేసిఆర్ ( CM kcr )ఎమ్మెల్యే అభ్యర్థుల పై గట్టిగానే సీరియస్ అవుతున్నారట.ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన త్వరలో కోలుకొని ఫుల్ యాక్టివ్ కానున్నారట.ఈలోగా ప్రతిఒక్కరు ప్రజల్లో ఉండాలని కీలక సూచనలు చేస్తున్నారట కేసిఆర్.
ప్రతిఒక్కరూ ఏ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని చెబుతున్నారట.మొత్తానికి హ్యాట్రిక్ గెలుపు కోసం అధినేత కేసిఆర్ ( CM kcr )గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.