విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.తెలంగాణలో వసూలయ్యే పన్నుల్లొ వాటా కావాలని ఏపీ చేసిన వాదనను తెలంగాణ వ్యతిరేకించింది.
విద్యుత్ బాకాయిలు, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన పన్నుల కోసం, విభజన చట్టానికి సవరణ, నగదు నిల్వల పంపిణీ, పౌరసరఫరాల సంస్థకు రావాల్సిన సబ్సిడీల అంశాలపై సుధీర్ఘ చర్చ జరిపిన విషయం విధితమే.
కాగా, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మధ్య నెలకొన్న సఖ్యత కొద్దిరోజులుగా విభేదాలకు చేరుతోంది.
ఇందుకు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలే ప్రధాన కారణమని తెలుస్తోంది.విద్యుత్, ఫైనాన్స్ కార్పొరేషన్, ఇతర ఆర్థిక వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వం కోర్టుల్లో కేసులు వేయడాన్ని తెలంగాణ అధికారులు తప్పుబట్టారు.
కోర్టుల్లో వేసిన కేసులు విత్ డ్రా చేసుకుంటే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని తెలంగాణ అధికారులు తేల్చి చెప్పగా ఏపీ అధికారులు మాత్రం స్పందించలేదు.కేంద్రం కూడా మిన్నకుండిపోయింది.
రెండు రాష్ట్రాలకు సమాన ప్రాతినిథ్యం వహించాలని గతంలోనే తెలంగాణ కేంద్రానికి లేఖ రాసింది.అయినే పెండింగ్‌లోనే పెట్టారు.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న ఎస్ఎఫ్‌సీ ఆపరేషనల్ యూనిట్ భవనాన్ని పంచాలంటూ కోర్టులో ఏపీ మరో కేసు వేసింది.ఈ కేసులను ఉపసంహరించుకుంటే పురోగతి ఉంటుందని తెలంగాణ స్పష్టం చేసింది.
ఏపీకి ఏకపక్షంగా చేసిన విభజన ప్రతిపాధనను ఆమోదించొద్దని కోరింది.
ఏపీ నిర్వాకం వల్ల ఎస్‌బీఐలో క్యాష్ క్రెడిట్ దక్కకుండా విపత్కర పరిస్థితి ఏర్పడిందనే రీతిలో తెలంగాణ రాష్ట్ర అధికారులు వాదించారు.
రాష్ట్ర విభజన తరువాత కేంద్ర సబ్సిడీలు అన్నీ ఏపీ ఖాతాలోకే వెళ్లాయని , వాటిని తెలంగాణ కు ఇవ్వకుండా వాడుకుందని దోషిగా చేసే యత్నం చేసింది.రైతులనుంచి సేకరించిన పంటలకు డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు రుణాలు తీసుకోవాల్సి వచ్చిందంటూ వాదించింది.ఇలా రూ.354.08 కోట్లు బ్యాంకులకు బకాయి పడిందంటూ కమిటీలో ప్రస్తావించారు.కాగా కేంద్రం నుంచి సబ్సిడీ రాగానే తెలంగాణకు ఇస్తామని ఏపీ బదులివ్వడం చర్చకు దారితీస్తోంది.
మొత్తానికి కేంద్ర కమిటీ ముందు జగన్ ప్రభుత్వాన్ని దోషిగా చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.