బీజేపీపై కేసీఆర్ భారీ వ్యూహం... అదేంటంటే?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యూహ, ప్రతివ్యూహాలతో హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం లేదనే విషయం తెలిసిందే.

 Kcr S Huge Strategy Against Bjp Is That So , Telangana Politics , Kcr , Trs Par-TeluguStop.com

అయితే బీజేపీని కొంత మేర అడ్డుకుంటేనే టీఆర్ఎస్ కు మరల ఆశాజనక ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.లేకుంటే రానున్న రోజుల్లో బీజేపీ మరింత బలపడే అవకాశం ఉంటుంది.

అయితే బీజేపీని నిలువరించడానికి కెసీఆర్ ప్రశాంత్ కిషోర్ సహాయంతో భారీ వ్యూహాన్ని పన్నుతున్నట్లు తెలుస్తోంది.అయితే బీజేపీ చాలా చాకచక్యంగా మైండ్ గేమ్ ఆడేందుకే తెర వెనుక తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో వాటిని తన సెటైర్ లతో ప్రజల్లోకి చాలా లోతుగా వెళ్ళేలా వాటిని తిప్పికొట్టే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఎంత వరకు ఇది సఫలమవుతుందనే విషయంపై ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి మనకు కాస్త అవగాహన వచ్చే అవకాశం ఉంది.

అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే భావనను వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఎన్నికల వాతావరణం రణరంగంగా మారే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

అయితే బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడం టీఆర్ఎస్ కు లాభించే విషయం కాగా, కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత కుమ్ములాటలతోనే ఎక్కువగా ప్రజల్లో ఉంటున్న క్రమంలో ప్రజలు అంతగా కాంగ్రెస్ ను సీరియస్ గా తీసుకునే ప్రసక్తే లేకపోవటం టీఆర్ఎస్ కు లాభించే రెండో విషయం .ఈ రెండిట్లో బీజేపీని మాత్రమే చాకచక్యంగా ఎదుర్కొనేలా ఇప్పటికే అస్త్రాలు సిద్దం చేసిన కెసీఆర్ ఎన్నికల సమయంలో ఇటు ప్రజల్లో అనుకూల వాతావరణం ఉండేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube