జనసేన టీడీపీలే లక్ష్యంగా గోదావరి జిల్లాలపై కేసీఆర్ ఫోకస్ ?

దేశమంతట బిఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.దేశవంతట పార్టీని విస్తరించే క్రమంలో ముందుగా తమకు బలం, ఆదరణ ఉంటుందనుకుంటున్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

 Kcr's Focus On Godavari Districts As Target Of Janasena And Tdp , Janasena, Td-TeluguStop.com

ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.త్వరలోనే బిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

ఇక పూర్తిగా పార్టీలో చేరికల పైనే ఫోకస్ పెట్టారు.ఏపీలోని అన్ని పార్టీల్లోని ప్రధాన నాయకులను, గతంలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండి, ప్రస్తుతం సైలెంట్ అయిపోయిన కీలక నేతలందరినీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

వారి అనుభవం, సామాజిక వర్గాల నేపథ్యం, వారి రాజకీయ అనుభవం, ప్రజల్లో ఉన్న ఆదరణ ఇలా అన్నిటిని లెక్కల్లోకి తీసుకుంటూ,చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు.

దీనిలో భాగంగానే ముందుగా టిడిపి, జనసేన లో కీలకంగా పనిచేసి, ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్న  వారిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దీనిలో భాగంగానే ఏపీ కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను పార్టీలో చేర్చుకుంటున్నారు.ఆయనకు బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

చంద్రశేఖర్ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు.గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలోను ,అలాగే జనసేన లోను కీలకంగా వ్యవహరించారు.

ఈరోజు హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమక్షంలో చంద్రశేఖర్ పార్టీలో చేరబోతున్నారట.

Telugu Brs, Janasena, Pawan Kalyan, Prajarajyam, Ysrcp-Political

చంద్రశేఖర్ తో పాటు, టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు, అలాగే మాజీ ఐ ఆర్ ఎస్ అధికారి పార్థసారథి పార్టీలో చేరబోతున్నారట.వీరితో పాటు గోదావరి జిల్లాలకు చెందిన కీలక నాయకులు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకోబోతున్నట్లు సమాచారం.గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం.

అంతేకాకుండా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.గోదావరి జిల్లాలో వచ్చిన సీట్లు కీలకం అవుతాయి.

ఈ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుండడం ఆనవాయితీగా మారింది.ఇప్పుడు అదే సెంటిమెంటు ను బీఆర్ఎస్ పాటించాలని చూస్తోంది.

దీనిలో భాగంగానే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో టిఆర్ఎస్ పట్టు పెరిగేలా చేసుకోవాలని, ఈ రెండు జిల్లాల్లో కీలకంగా ఉన్న నాయకులందరినీ, అలాగే తటస్థులను తమ వైపుకు తిప్పుకుంటే ఆశించిన ఫలితాలు వెలువడుతాయనే లెక్కల్లో బీఆర్ఎస్ ఉందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube