కాళేశ్వరం ప్రాజెక్టు తో కేసీఆర్ కుటుంభమే బాగుపడ్డదని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం సరస్వతీ బ్యారేజీ బ్యాక్ వాటర్ తో పరిసర గ్రామాలల్లో వరద ముంపునకు గురైన ప్రాంతలను పరిశీలించారు.
నిన్న నిర్మల్ మంచిర్యాల పర్యటన ముగించుకొని రాత్రి 7 గంటలకు గోదావరిఖని కి చేరుకొని సింగరేణి గెస్ట్ హౌస్ లో బస చేశారు.ఈ రోజు ఉదయం గోదావరిఖని,మంథని లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
అనంతరం మహదేవపూర్ మండలంలోని సరస్వతీ బ్యారేజీ ని సందర్శించారు.కన్నెపల్లి పంపుహౌస్ వెళ్తున్న క్రమంలో అన్నారం క్రాస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
కార్యకర్తలతో జాతీయ రహదారిపై బైఠాహించి నిరసన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వల్ల గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురైయ్యాయని, 18 ఏళ్ల క్రింద దేవాదుల ప్రాజెక్టు కట్టారు,ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు.
మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలిపోతుంది.కేసీఆర్ చేతకాని తనానికే నిదర్శనం అని హెద్దేవా చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు తో ముఖ్యమంత్రి కుటుంభం అటు మెగా కంపెనీ కృష్ణారెడ్డి బాగుపడ్డారని,లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని,ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ఒక అద్భుతమని చెప్పాడు.ఇప్పుడేంటి ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.