కెసిఆర్ సరికొత్త లేఖాస్త్రం వెనుక వ్యూహం ఏమిటంటే?

తను అనుకున్న వ్యూహాన్ని అమలు చేయడమే తప్ప ఎవరికి ఎటువంటీ సంజాయిషీలు వివరణలు ఇవ్వడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) కి అంతగా నచ్చదు.తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ఇటీవల పరిణామాల వరకు ఆయన అనుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతారు తప్ప , దానిపై మళ్లీ స్పందన గాని ఆ విమర్శలకు వివరణ గాని ఏమీ ఉండదు.

 Kcr Wrote Letter To His Followers Required Sympathy On Him, Kcr, Telangana, Kavi-TeluguStop.com

అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్లుగా అర్థమవుతుంది కేంద్రంలో జెండా పాతాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో తాను మరింత బలపడాలని, అప్పుడే బలమైన ప్రాంతీయ పార్టీగా ప్రతిపక్షాలలో పేరు దక్కుతుందని అప్పుడు ప్రతిపక్షాల కూటమికి పెద్దన్న పాత్ర పోషించే అవకాశం వస్తుందని ఆయన లెక్కలేసుకుంటున్నారు అయితే జరుగుతున్న పరిణామాలు ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యాయి ఒకపక్క కవిత( Kavitha ) విషయంలో ఈడీ విచారణ కలత రేపుతుంటే మరోపక్క టీపీ ఎస్ ఎస్ సి( TPSSC )వ్యవహారం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.ఇప్పుడు ఈ పరిణామాలు అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు ఎక్కడ బలపడతాయో అన్న ఆలోచన కేసీఆర్ కి నిద్ర లేకుండా చేస్తుంది.

అందుకోసమే కార్యకర్తలని ఎమోషనల్ గా పార్టీకి కనెక్ట్ చేయడం కోసం ఆయన లేఖాస్త్రం సంధించినట్టుగా తెలుస్తుంది .

Telugu Kavitha, Kcrwrote, Sympathy, Telangana, Tpssc-Telugu Political News

ఎన్నో కష్టాలకి ఓర్చి తెలంగాణ( Telangana )ను తీసుకురావడంలో తాను పడిన కష్టాలను కార్యకర్తలకు వివరిస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా విజయం సాధిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేయడం వెనక మరొకసారి ప్రజల్లో తెలంగాణ సాధించిన వ్యక్తిగా తన విజయాలను గుర్తు పెట్టుకోవాలని అన్యాపదేశంగా తెలియజేశారని అంతేకాకుండా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే తనని ఇబ్బంది పెడుతున్నాయి అన్న విషయాన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకునే విధంగా ఆయన ఈ లేఖ లో పలు అంశాలు ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల బలం కూడా తగ్గితే పార్టీ కి కష్టమని గుర్తించిన కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లుగా ఈ పరిణామం తెలియజేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఏదేమైనప్పటికీ తనకు కావాల్సినప్పుడే ప్రజల్ని గాని మీడియానిగానే కలిసి కేసీఆర్ లో ఈ కొత్త మార్పు పార్టీ శ్రేణులను కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube