తెలంగాణ రాష్ట్రంలో గడిచిన వారం రోజుల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం.మారిపోయింది.
పైగా అధికార పార్టీ భారీగా వేసిన ఎత్తుగడ కూడా ఇప్పుడు మేధావులకు అర్ధమైపోయింది.అయితే.
ఎవరూ నోరు మెదిపే పరిస్థితి లేకపోవడం గమనార్హం.దీంతో తమకు తెలిసిన వర్గాలకు వారు లీకులు ఇస్తూ.
విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.ఒక్కసారి వారం రోజుల కిందటి తెలంగాణ రాజకీయం చూద్దాం.
సిద్ధి పేట జిల్లా దుబ్బాక ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘోరంగా ఓడిపోయింది.
సింపతీ కూడా ఇక్కడ వర్కవుట్ కాలేదు.సరే! ఆ తర్వాత రెండు రోజులకు అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.
కొన్నాళ్ల కిందట కురిసిన వర్షాలతో హైదరాబాద్ మునిగిపోయింది.మనిషిలోతు నీళ్లు ముసురుకున్నాయి.
దీంతో మునక ప్రాంతాల్లోని వారిపై కేసీఆర్ సర్కారు వరాల జల్లు కురిపించింది.కొందరికి పంచి తర్వాత ఆగిపోయారు.అయితే.ఇంతలోనే మరోసారి.
హైదరాబాద్ మునక ప్రాంతాల వారికి మరోసారి సాయం చేస్తున్నామని.అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అంతేకాదు, దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఆరేడు గంటల్లోనే వారి ఖాతాల్లో రూ.10 వేలు పడిపోయాయి. సరే! ఇది సహజమే కదా అనుకున్నారు అందరూ.అంతేకాదు.ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించిన మంత్రి కేటీఆర్ కూడా ఇప్పట్లో గ్రేటర్ ఎన్నికలు లేవని.ఫిబ్రవరి చివరి వారంలోనో ఎప్పుడో వస్తాయని.
ఆ ముచ్చట ఇప్పుడెందుకని అంటూనే.గ్రేటర్‌పై వరాల జల్లు కూడా కురిపించారు.
పన్ను రాయితీలు కూడా ప్రకటించారు.

మొత్తంగా రాష్ట్రం అంతా అమలు చేస్తున్నామని చెబుతూనే ప్రధాన ఫోకస్ అంతా కూడా గ్రేటర్‌పైనే పెట్టారు.ఇక, మరోవైపు.టీఆర్ ఎస్ మిత్రుడు.
ఎంఐఎం అధి నేత అసదుద్దీన్ ఒవైసీ అనూహ్యంగా కేసీఆర్‌తో భేటీ అయ్యారు.దీనిని కూడా అందరూ జనరల్ అనే అనుకున్నారు.
ఎందుకంటే.ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో అసదుద్దీన్ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది కాబట్టి.
కేసీఆర్‌తో ముచ్చటించేందుకు వెళ్లారని అనుకున్నారు.వారం ముగిసింది.
ఒక హఠాత్పరిణామం మీడియాలో హల్‌చల్ చేసింది.మంత్రి కేటీఆర్ అన్యాపదేశంగా ప్రస్థావించిన గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.
నిజానికి ఆయన చెప్పింది ఎప్పుడు.ఫిబ్రవరిలో… కానీ, ఎన్నికల సంఘం మాత్రం ప్రకటన జారీ చేసింది.అయితే.అటు వారంలోనే జరిగిన కీలక పరిణామాలు.ఇటు ఎన్నికల సంఘం ప్రకటన వెనుక.చాలానే జరిగిందనేది ఇప్పుడు మేధావులు చెబుతున్న మాట.
రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి గ్రేటర్ ఎన్నికలపై ప్రభుత్వానికి ముందుగానే ఉప్పందిందని.దీనిని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గతంలో ఎన్నడూ లేనిది .వరాల జల్లు కురిపించేశారని.అదేసమయంలో ఎక్కడో పాట్నాలో ఉన్న అసదుద్దీన్‌ను హుటాహుటిన రప్పించి.
సీట్ల పంపకాలపై చర్చించారని అంటున్నారు.
ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.
రాష్ట్ర ఎన్నికల సంఘంతో ఏపీ సర్కారు పేచీ పెట్టుకుని ఏమీ సాధించలేక.తికమకపడుతుంటే.
అదే ఎన్నికల సంఘంతో మంచిగా ఉంటూ.కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలకు తెరదీస్తున్నారనే! ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.కేవలం రెండు రోజుల కిందట మొదలు పెట్టిన గ్రేటర్ వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలను గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో కూడా ఆపాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషనర్ పేర్కొనడం గమనార్హం.సో.ఇదీ.కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ.!! మరి ఎక్కడ తగ్గాలో.
ఎక్కడ నెగ్గాలో కేసీఆర్ నేర్పుతున్న పాఠం.ఏపీ సీఎం జగన్‌కు కనిపిస్తోందా? అన్నది ప్రధాన ప్రశ్న.