'ఈటెల ' కోసం కేసీఆర్ కష్టాలు ?

ఎప్పుడూ లేనంతగా తెలంగాణ సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారు.అంతకంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు.

అకస్మాత్తుగా శత్రువు గా చేసుకున్న తమ పార్టీ నాయకుడు, మాజీమంత్రి, ఉద్యమ కాలం నుంచి తనతో కలిసి పనిచేసిన ఈటెల రాజేందర్ ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ వేయని ఎత్తుగడ లేదు.ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసేందుకు ఇప్పటికే రాజేందర్ వ్యాపార కార్యకలాపాలపై, ఆయనకు సంబంధించిన లిక్కర్ బిజినెస్ ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అలాగే మొన్నటి వరకు రాజేందర్ ను ఇరుకున పెట్టేందుకు, హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన పట్టు తగ్గేలా చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ ద్వారా ప్రయత్నాలు చేసిన కేసీఆర్ ఆయనతో పెద్దగా ఉపయోగం లేదు అనే అభిప్రాయంతో రాజేందర్ కు సన్నిహితుడైన తన మేనల్లుడు మంత్రి హరీష్ రావు ను రంగంలోకి దించారు.ఇప్పుడు హరీష్ , ఈటెల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటెలను ఒంటరి చేసేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.టిఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గం లో కీలక నాయకులు ఎవరూ ఈటెల రాజేందర్ వెంట వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు.

Advertisement

ఈ విషయంలో కాస్త సానుకూలత ఏర్పడినట్టుగానే కెసిఆర్ భావిస్తున్నారు.కేవలం హరీష్ ఒక్కడినే నమ్ముకోకుండా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను సైతం ఈటెల వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

వీరిద్దరే కాకుండా మరో నలుగురు నేతలకు ఈటెల ను రాజకీయంగా ఎదుర్కొనే బాధ్యతలను కెసిఆర్ అప్పగించినట్టు సమాచారం.హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్న ప్రతి మండలం,  గ్రామంలోనూ తమ పట్టు చేజారకుండా టిఆర్ఎస్ దృష్టి పెట్టింది.

అయితే ఒక్క ఈటెల రాజేందర్ గురించి కెసిఆర్ ఇంతగా టెన్షన్ పడుతూ ఉండడంపైన జోరుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఆయనకు అంతగా ఎందుకు భయపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే రాజేందర్ బలం ఏమిటి అనేది కెసిఆర్ కు బాగా తెలుసు.టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తన వెంట ఉండడంతో ఆయన ఆలోచనలు, వ్యూహాలు కేసీఆర్ కు బాగా తెలియడంతోనే ఇంతగా జాగ్రత్తపడుతున్నారట.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

ఈటెల కారణంగా టిఆర్ఎస్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వైపుల నుంచి రాజేందర్ బలాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తూనే, కేసీఆర్ టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు