మరికొద్ది రోజుల్లోనే బిజెపి లో చేరబోతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపి తనకు, తన వెంట నడిచే కార్యవర్గానికి బిజెపిలో ప్రాధాన్యంతో పాటు, కీలకమైన పదవులు పొందే విషయంలో హామీ పొందారు.మరో వారం రోజుల్లోపు బిజెపిలో అధికారికంగా చేరబోతున్నారు.
ఈ సమయంలోనే తన వెంట భారీ స్థాయిలో నాయకులను తీసుకువెళ్లాలని , తెలంగాణ వ్యాప్తంగా తనకు ఏ మేరకు బలం ఉందో నిరూపించుకోవాలని, దీని ద్వారా బిజెపి దగ్గర తన క్రెడిట్ పెరిగేలా చేసుకోవడంతో పాటు, టిఆర్ఎస్ కు ఆందోళన పెంచాలనే లక్ష్యంతో రాజేందర్ అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తో పాటు, ఎంతో మంది నాయకులు ఈటెల వెంట నడిచేందుకు సిద్ధం అయ్యారు.
తనకు గట్టి పట్టు ఉన్న కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ కి నాయకులు లేకుండా చేసి దెబ్బకొట్టాలి అనేది ఈటెల ప్లాన్.ఆ లక్ష్యం తోనే ఆయన రాజకీయ అడుగులు వేస్తున్నారు.
కరీం నగర్ జిల్లానే కాకుండా బీసీ, రెడ్డి సామాజిక వర్గాల కు చెందిన నేతలను తన వెంట తీసుకువెళ్ళి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలి అని చూస్తున్నారు.తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ తో పాటు ఉండి కీలకంగా వ్యవహరించిన తుల ఉమ ఇప్పుడు ఈటెల వెంట నడిచేందుకు సిద్ధం అయ్యారట.
కరీంనగర్ జెడ్పీ పనిచేసిన ఆమె, ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన లభించకపోవడంతో సైలెంట్ గా ఉంటున్నారు .అదీ కాకుండా మొదటి నుంచి ఈటెల రాజేందర్ వర్గం గా ఆమె పేరు పొందారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుల ఉమ చేసిన కొన్ని కామెంట్స్ ఆమె ఈటెల రాజేందర్ వెంట నడవబోతున్నారు అనే విషయాన్ని రుజువు చేశాయి.ఎక్కడ కెసిఆర్ పేరు ఎత్తకుండా తెలంగాణలో నెలకొన్న నిరుద్యోగ సమస్య విషయమై ఆమె మాట్లాడారు.స్వరాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించామా ? బడుగు బలహీన వర్గాల జీవితంలో వెలుగులు నింపామా ? ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య తెలంగాణలో నిర్మించామా అంటూ ఆమె మాట్లాడిన మాటలు కెసిఆర్ పరిపాలన పై చేసిన కామెంట్స్ గానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ఈటెల బిజెపి లో చేరే సమయంలో ఆమె కూడా ఆయనంటే ఉంటారని, వీరే కాకుండా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు టిక్కెట్లు ఆశించి భంగపడ్డ వారు అనేకమంది ఈటెల వెంట వెళ్లి బిజెపిలో సరైన ప్రాధాన్యం పొందాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ టిఆర్ఎస్ లో కాస్త కంగారు పుట్టిస్తున్నాయి.ఇప్పటికే కాస్త ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని రిపోర్టులు వస్తున్న సమయంలో నాయకులు టిఆర్ఎస్ ను వీడితే రాబోయే ఎన్నికల నాటికి ఆ ప్రభావం తప్పకుండా కనిపిసతుందని టెన్షన్ పడుతోంది