కేసీఆర్ టార్గెట్ కాంగ్రెస్ ! బీజేపీ పై మౌనం ?

కర్ణాటక( Karnataka ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లో మార్పు కనిపిస్తోంది.

పూర్తిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని కెసిఆర్ విమర్శలు చేస్తున్నారు.

పూర్తిగా తమ టార్గెట్ కాంగ్రెస్ అన్నట్లుగానే కేసీఆర్( KCR ) వ్యవహరిస్తున్నారు.తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో అనేక రాజకీయ అంశాలపై చర్చించారు.ఇక ఆ తర్వాత బిజెపిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ విమర్శించారు.అలాగే మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నేతలకు శిక్షణ కార్యక్రమం లోనూ ప్రసంగించిన కేసీఆర్ అక్కడ అధికారంలో ఉన్న బిజెపి , షిండే( BJP, Shinde ) ప్రభుత్వంపై ఎక్కడా విమర్శలు చేయలేదు.అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేశారు.70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు.

 కేవలం కాంగ్రెస్ నే కెసిఆర్ టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం, బిజెపి విషయంలో విమర్శలు చేయకపోవడం తో అనేక అనుమానాలు మొదలయ్యాయి.కేసీఆర్ బిజెపితో లాలూచీ పడ్డారని , అందుకే ఆ పార్టీ జోలికి వెళ్లడం లేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.మొదట్లో కాంగ్రెస్ విషయాన్ని పట్టించుకోకుండా, బిజెపిని టార్గెట్ చేసుకుని కెసిఆర్ విమర్శలు చేసేవారు.

తెలంగాణలోనూ బిజెపితోనే తమకు ప్రధాన పోటీ అని, కాంగ్రెస్ తమ దరిదాపుల్లో కూడా రాలేదని నమ్మేవారు.అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి కంటే కాంగ్రెస్ బలం తెలడం తో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు కాస్తో కూస్తో అనుకూల పవనాలు వీస్తున్నాయి అనే సంకేతాలు , ఇతర రాష్ట్రాల్లోని అధికార పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు కు  సిద్ధమనే సంకేతాలు పంపిస్తున్న నేపద్యంలో ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

రానున్న రోజుల్లో బిజెపి కంటే కాంగ్రెస్ తోనే తమకు ప్రధాన పోటీ ఉంటుందని కేసిఆర్ భావిస్తుండడంతో ముందుగానే ఆ పార్టీని ఎక్కువ టార్గెట్ చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి , జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత కేసీఆర్ కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ స్కాం వ్యవహారం బయటపడడం,  ఆ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండడం,  మరికొన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని బిజెపి టార్గెట్ చేసుకున్న నేపథ్యంలో, కెసిఆర్ బిజెపి జోలికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని, కేసుల విషయంలో రాజీపడడంతోనే బిజెపిని పక్కనపెట్టి కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?
Advertisement

తాజా వార్తలు