పకడ్భందీ వ్యూహంతో కేసీఆర్ అడుగులు... మౌనవ్యూహం అందుకేనా?

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్న పరిస్థితి ఉంది.

కేసీఆర్ హామీలు కావచ్చు లేక ప్రభుత్వ తప్పిదాలు కావచ్చు ఇలా ప్రతి ఒక్కదానిని ప్రజల ముందు ఉంచుతూ ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను పెంచడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలు వదులుకోలేని పరిస్థితి ఉంది.

కేసీఆర్ కు ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా ఇక ఆ అవకాశాన్ని తన విజయావకాశంగా ఎలా మలుచుకుంటారనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం కెసీఆర్ టార్గెట్ గా ప్రతిపక్షాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న తరుణంలో కెసీఆర్ మాత్రం చాలా మౌనంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నా పరిస్థితి ఉంది.

KCR Steps In With An Armory Strategy Is That A Silent Strategy, Kcr, Trs Party-

ప్రతిపక్షాలు మాత్రం ప్రస్తుతం కెసీఆర్ వ్యవహరిస్తున్న తీరును మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది.ఎందుకంటే ప్రతిపక్షం విమర్శలకు అధికార పక్షం ఘాటు విమర్శలు చేస్తేనే ప్రతిపక్షాల విమర్శలు ప్రజల్లోకి వెళతాయి లేకపోతే ప్రజల్లోకి అంతగా వెళ్ళవు.

అయితే కెసీఆర్ మాత్రం ప్రస్తుతం పనితీరుపైనే దృష్టి పెడదామని ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తాజాగా జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.అందుకే కెసీఆర్ తాజాగా జరుగుతున్న రకరకాల పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఇంటిలిజెన్స్ సమాచారాన్ని తెప్పించుకుంటూ మౌన వ్యూహాన్ని అమలు పరుస్తూ మరల అధికారం చేజెక్కించుకునేలా వ్యూహ రచన చేస్తున్న పరిస్థితి ఉంది.

Advertisement

అయితే టీఆర్ఎస్ కూడా ఒక రాజకీయ పార్టీయే కాబట్టి ప్రతిపక్షాల కంటే భిన్నమైన రీతిలో వెళ్ళే అవకాశం వందకు వంద శాతం ఉంది.కావున కెసీఆర్ ఎప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారిన పరిస్థితి ఉంది.

మరి రానున్న రోజుల్లో కప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి కెసీఆర్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళతాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు