తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ అయితే బాగుంటుందని తెలిపారు.
మంత్రి పదవిని ఆశించినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా చోటు దక్కే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.మంత్రి పదవి వస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తుందని తెలిపారు.