అదేంటో గానీ కాంగ్రెస్ ఒకటి అనుకుంటే తెలంగాణలో మరొకటి జరిగింది.తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ఉంది కాబట్టి ఎలాగూ కాంగ్రెస్ గెలుస్తుందని అధిష్టానం భావించింది.
కానీ ఆ పార్టీకి అసలు తెలుగు రాష్ట్రాల్లో ఘోరమైన ఓటమి దిక్కయింది.రెండుసార్లు తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఎలాగైనా తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావాలని తెగ ట్రై చేస్తోంది.
ఇందులో భాగంగానే ఎంతమంది సీనియర్లు వద్దని బల్లగుద్ది చెప్పినా కూడా ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డికే పార్టీ పగ్గాలను అప్పగించింది.అయితే రేవంత్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయన ఇంకా అప్ డేట్ పాలిటిక్స్ చేయట్లేదని తెలుస్తోంది.
ఎందుకంటే బీజేపీ పార్టీ ఇప్పుడున్న పరిస్థితులను బేస్ చేసుకుని అధికారిన్ని చేజిక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది.కానీ రేవంత్ మాత్రం గతంలో జరిగిన వాటిపైనే ఆధారపడుతున్నారు.

కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతనే తమ పార్టీకి ప్రయోజనం చేకూర్చుతుందని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి.తెలంగాణలో ఇంతకు ముందు వరుసగా పదేళ్లు అధికారం చేసిన తర్వాత ఏ పార్టీకి కూడా మళ్లీ అధికారం దక్కలేదని ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఆయన అంటున్నారు.అంటే టీడీపీ గానీ లేదా కాంగ్రెస్ గానీ పదేళ్లు అధికారం దక్కించుకుని ఆ తర్వాత ఓడిపోయాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా 2023 వరకు పాలిస్తారని, ఆ తర్వాత తమ పార్టీయే అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెబుతున్నారు.కానీ ఏ పార్టీకి అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలను ఆకట్టుకునే విధంగా పోరాటాలు చేస్తేనే ఫలితం ఉంటుంది.
లేదంటే గెలుపు కష్టమే.మరి రేవంత్ కూడా ఇలాంటి నమ్మకాలపై ఆధారపడకుండా జనాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తేనే గెలుపు సాధ్యమని కార్యకర్తలు చెబుతున్నారు.
చూడాలి మరి రేవంత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.