ఎర్ర పార్టీలను వెయిటింగ్ లో పెట్టిన కేసీఆర్ !  బాధ మామూలుగా లేదు 

కేసిఆర్( KCR ) తీరు ఇదేవిధంగా ఉంటుంది.ఒక పట్టాన ఎవరికి అర్థం కాదు.

 Kcr Put The Red Parties On Hold! Suffering Is Not Normal, Tammineni Veerabadram,-TeluguStop.com

ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తారో, ఎవరిని ఎప్పుడు పక్కన పెడతారో అర్థం కాదు.ప్రస్తుతం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని తహతలాడుతున్న వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంల( CPI , CPM ) పరిస్థితి ఇదే విధంగా ఉంది.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని సక్సెస్ అయింది.అక్కడ జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.

ఆ పొత్తు అక్కడ వరకు సరిపెట్టకుండా,  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోను కొనసాగించాలని అప్పట్లో వామపక్ష పార్టీల నేతలతో పాటు,  కేసీఆర్ సైతం అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో అధికారికంగా బీఆర్ఎస్( BRS ) తో పొత్తును కన్ఫర్మ్ చేసుకోవాలని సిపిఐ , సీపీఎంలు భావిస్తుండగా, తమ నిర్ణయం ఏమిటి అనేది మాత్రం కేసిఆర్ తేల్చడం లేదు.

దీంతో అంతర్గతంగా వామపక్ష పార్టీల నేతలు కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.పైకి మాత్రం బీఆర్ఎస్ తోనే తమ పొత్తు ఉంటుందని, దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని ప్రకటనలు చేస్తున్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ వ్యవవహారంపై స్పందించారు.బీజేపీ ని నిర్వీర్యం చేయాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఆయన క్లారిటీ ఇచ్చారు.

తాము ఇదివరకే కేసీఆర్ ను అపాయింట్మెంట్ కోరామని, అయితే అది దొరకలేదని, కేసిఆర్ తో చర్చించేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపారు.

Telugu Brscpi, Brs, Munugodu, Telangana-Politics

కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తామని, తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని తమ్మినేని అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కలిసి పనిచేద్దామని కోరింది కేసీఆరేనని, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోను కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని కేసీఆర్ చెప్పారరని, మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారు అని, కేసీఆర్ అంశంపై మాతో చర్చించలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు అన్నారు.కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవడం లేదని అనుకుంటున్నారు.

మాకు బలం ఉన్నచోట ఎన్నికలకు సిద్ధం అవుతున్నాం అంటూ తమ్మినేని ( Tammineni )వ్యాఖ్యానించారు.ఇక కమ్యూనిస్టులు బిఆర్ఎస్ కు దూరంగా ఉన్నారని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోనే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండడం పై తమ్మినేని ఖండించారు.

Telugu Brscpi, Brs, Munugodu, Telangana-Politics

బిజెపి కి వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకం చేయడమే తమ పార్టీల లక్ష్యం అంటూ తమ్మినేని అన్నారు.కమ్యూనిస్టు పార్టీలకు సిద్ధాంతం ముఖ్యం, సీట్లు ,ఎలక్షన్లు ప్రాధాన్యం కాదని, ఎన్నికల ప్రకటన తరువాత సీట్ల పై చర్చిస్తామని, వేరువేరుగా పోటీ చేయడం వల్ల చాలా నష్టపోయామని, కలిసి ఉండడం వల్ల లాభపడ్డామని ఆయన తెలిపారు.ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభశివరావు ( Koonanneni Sambhashivarao )ఇదే విధమైన స్పందన వ్యక్తం చేస్తున్నారు.తమకు బిఆర్ఎస్ పార్టీకి అవగాహన ఉందని, కెసిఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని భావిస్తున్నామని కూనంనేని సాంబశివరావు చెబుతున్నారు .తాము ఈ విషయాలపై కేసీఆర్ తో చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరామని, 22 తర్వాత అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని, తమకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కేసిఆర్ కు ఉంది అంటూ కూనంనేని వ్యాఖ్యానించారు.మొత్తంగా చూస్తే వామపక్ష పార్టీలు కేసీఆర్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube