కెసిఆర్ నయా గేమ్ ప్లాన్ : కాంగ్రెస్ తో దోస్తీ వెనక వ్యూహం ఇదేనా?

అంది వచ్చిన అవకాశాలను అద్భుతంగా ఓడిసిపట్టగల రాజకీయ నాయకుల్లో కేసీఆర్( KCR ) పేరు ముందు వరుసలో ఉంటుంది తెలంగాణ విషయంలో దశాబ్దాల పాటు అనేకమంది నేతలు పోరాటాలు చేసినా కూడా అనుకూల సమయాన్ని, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకొని ఆ పోరాటాలన కి నాయకత్వం వహించి వాటిని ఉదృత స్థాయికి తీసుకెళ్లి తెలంగాణ తెచ్చిన ఘనతను పూర్తిగా తన అకౌంట్లో వేసుకుని ఆ కీర్తి తో తెలంగాణ ముఖ్యమంత్రి స్థానాన్ని రెండుసార్లు అధిష్టించిన ఘనత కేసిఆర్ ది.

 Kcr Plans To Support Upa Instead Of Third Front, Kcr , Upa , Bjp , Rahul Gandhi-TeluguStop.com
Telugu Congress, Delhi, Modi, Rahul Gandhi-Telugu Political News

ఇప్పుడు కేంద్రంతో ప్రత్యక్ష యుద్ధానికి తెర తీసిన కేసిఆర్ కి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్న వేళ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పరిణామం కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్టు అయింది.ఇప్పటివరకు తమ పోరాటానికి పెద్దగా మద్దతు తెలపని ప్రతిపక్షాలు ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో మాత్రం బాజాపా నాయకత్వం పై పూర్తిస్థాయిలో దండెత్తాయి .ఇప్పుడు కేంద్రంపై కేసీఆర్ పోరాటానికి చాలా బలం దొరికినట్లు అయింది .అంతేకాకుండా ఇప్పుడు పూర్తిస్థాయిలో రాహుల్ గాంధీ విషయం లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో ముందడుగు వేయడానికి సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారని కాంగ్రెసు యేతర భాజాపా యేతర కూటమి కోసం ఆయన ఎంత నిజాయితీగా ప్రయత్నం చేసినా కూడా ప్రతిపక్షాల నుంచి అంత మద్దతు దొరకలేదు.ఒకవేళ వీరందరినీ కలుపుకొని అధికారానికి దగ్గరగా వెళ్లిన కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం కష్టమేనని ఎప్పుడు ఎవరు కాడి పడేస్తారో అని ఎదురు చూడాలని, దానికంటే కాంగ్రెస్తో కలిసి నడవడమే మంచి పద్ధతి అని కేసీఆర్ బావిస్తునారట.

Telugu Congress, Delhi, Modi, Rahul Gandhi-Telugu Political News

విధానపరంగా కూడా కాంగ్రెస్ బలమైన నమ్మకమైన భాగస్వామీ అని కేసీఆర్ నిర్ణయించుకున్నారట మూడో ప్రo ట్ కన్నా కాంగ్రెస్తో జతకట్టి అధికారాన్ని పంచుకోవడమే ప్రస్తుతానికి మంచి వ్యూహం అని ఆయన ఫిక్స్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకే రాహుల్ విషయంలో అందరికన్నా ముందు బలంగా తన వాదన వినిపించిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ( Delhi ) వేదికగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికి స్వయంగా బయలుదేరుతున్నారట మరి కొత్త వ్యూహానికి తెరతీసిన కేసిఆర్ ఎంత మేరకు విజయవంతం అవుతారు అన్నది తొందరలోనే తెలుస్తుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube