రిజల్ట్స్ తరువాత కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్ ?

తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ డిసెంబర్ 3న విడుదల అయ్యే ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఈ సారి విజయంపై బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.70 పైగా సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తామని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతుంటే.అటు కాంగ్రెస్( Congress ) కూడా 70 నుంచి 80 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.

 Kcr Master Plan After Results , Brs , Cm Kcr , Congress , Bjp , Telangana P-TeluguStop.com

ఇక ఇప్పటివరకు విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే విన్నింగ్ శాతం ఎక్కువగా ఉందని తేల్చి చెప్పాయి.దీంతో అధికారం హస్తంపార్టీ చేతిలోకి వెళ్లకుండా ఉండేందుకు బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్ కు రెడీ అయినట్లు తెలుస్తోంది.

Telugu Cm Kcr, Congress, Poloitics, Revanth Reddy, Telangana-Politics

ఎలాగైనా మూడో సారి సి‌ఎం పదవి అధిష్టించాలని చూస్తున్న కే‌సి‌ఆర్ కాంగ్రెస్ పై పైచేయి సాధించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.ప్రస్తుతం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు 50-60 స్థానాలు, బి‌ఆర్‌ఎస్ కు 40-55 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు ఇతర పార్టీలతోనూ కే‌సి‌ఆర్( CM kcr 0 మంతనాలు జరుపుతున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆల్రెడీ ఏంఐఏం తో పొత్తు ఉన్నందున ఆ పార్టీ గెలిచిన స్థానాలు కూడా బి‌ఆర్‌ఎస్ ఖాతాలొకే వెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు.

Telugu Cm Kcr, Congress, Poloitics, Revanth Reddy, Telangana-Politics

బిజెపికి 1-5 స్థానాలు వచ్చిన. బి‌ఆర్‌ఎస్ ( BRS )కు మద్దతు తెలిపే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.ఇకపోతే కాంగ్రెస్ లోని కొంతమంది ఎమ్మెల్యేలను కూడా బి‌ఆర్‌ఎస్ వైపు తిప్పుకునే ఛాన్స్ ఉందట.

దాంతో మొత్తం మీద అధికారం కోల్పోకుండా ఉండేందుకు కే‌సి‌ఆర్ అన్నీ రకాలుగా వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే కాంగ్రెస్ పార్టీ 70కి పైగా స్థానాల్లో గెలిస్తే బి‌ఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

మరి కే‌సి‌ఆర్ తన చతురత ప్రదర్శించి అధికారాన్ని గుప్పిట్లోనే ఉంచుకుంటారా ? లేదా ప్రజలు కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి అధికారం కట్టబెడతారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube