గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.డిసెంబర్ మొదటి వారంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్నారు.తెలుగు జనాభా ఉన్న కొన్ని స్థానాల్లో పోటీ చేయడం లేదా మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలాకు మద్దతు ఇవ్వడం అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి.
కేసీఆర్ తన తాజా ప్రసంగాల్లో బీజేపీతో టార్గెట్ చేస్తూ వస్తున్నారు.తాజాగా తన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని చేసిదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి దేశాన్ని భాజపా నుంచి కాపాడుతామని శపథం చేశారు.

ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు.అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఆ ఛాలెంజ్‌ను స్వీకరించడంలో పార్టీ పూర్తి స్థాయిలో సిద్దంగాలేదు.అలాగే, ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరు మార్పును ఇంకా ఆమోదించలేదు.
గుజరాత్ బీజేపీకి కంచుకోట.బీజేపీ కీలక నేతలు మోదీ, అమిత్ షాలు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటారు.
గుజరాత్ ఎంతో కొంత ప్రభావం చూపాలని కేసీఆర్ భావిస్తున్నారు.బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ ఇతర పార్టీలకు సపోర్ట్ ఇవ్వలా? లేదా ఆఫ్‌తో జత కట్టలా అని టీఆర్ఎస్ అధి నాయకత్వం ఆలోచిస్తుంది.1998 నుంచి గుజరాత్లో బీజేపీ విజయం సాధిస్తు వస్తుంది.కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ.ఈ ఎన్నికలను ఆప్ కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. 60-70 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎన్నికలు జరగబోతున్నగుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ టీమ్ గుజరాత్‌లోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనుంది. బీజేపీకి ఓటు వేయోద్దు అనిటీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయనున్నారట.ప్రచారం కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరి టీఆర్ఎస్ ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.